Wednesday, January 22, 2025

భూతకోలపై వ్యాఖ్యలు..నటుడిపై పోలీసుల కేసు

- Advertisement -
- Advertisement -

 

బెంగళూరు: దేశవ్యాప్తంగా అన్ని భాషలలో అఖండ విజయం సాధించిన కాంతార చిత్రంలో చూపించిన గిరిజన ప్రజల సంస్కృతికి చెందిన భూత కోల గురించి వ్యాఖ్యలు చేసిన కన్నడ నటుడు చేతన్ కుమార్‌పై పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేయడానికి కర్నాటక హైకోర్టు నిరాకరించింది. ఒక మతాన్ని కించపరిచేందిధంగా, మతాల మధ్య వైరాలను సృష్టించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై చేతన్‌పై నమోదు చేసిన కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులను ఈ దశలో అడ్డుకోలేమని కోర్టు తెలిపింది.

భూత కోల సంస్కృతిపై వ్యాఖ్యలు చేస్తూ హిందూ మతాన్ని కించపరిచే విధంగా చేతన్ ప్రకటన చేశారంటూ శివకుమార్ అనే వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుపై శేషాద్రినగర్ పోలీసులు కేసు నమోదు ఏశారు. అయితే భూతకోల సంస్కృతి హిందూ మతంలో భాగం కాదని మాత్రమే తాను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశానని చేతన్ కోర్టులో వాదించారు. తన వ్యాఖ్యలు హిందూ మతాన్ని కించపరిచే విధంగా లేవని, తాను ఏ మతం మధ్య వైషమ్యాలు సృష్టించేందకు ప్రయత్నింలేదని ఆయన వాదించారు. ఈ వాదనను హైకోర్టు కొట్టివేస్తూ ఈ కేసు దర్యాప్తును ఈ దశలో అడ్డుకోలేమని స్పష్టం చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News