Sunday, January 19, 2025

హీరో వెంకటేశ్, నిర్మాత సురేశ్ లపై కేసు నమోదుకు కోర్టు ఆదేశం

- Advertisement -
- Advertisement -

ఒక స్థలవివాదం కేసులో హీరో వెంకటేశ్ పై కేసు నమోదు చేయాలని నాంపల్లి క్రిమినల్ కోర్టు పోలీసులను ఆదేశించింది. వెంకటేశ్ తోపాటు ఆయన సోదరుడు సురేశ్, ఆయన కుమారులు, హీరో రానా, అభిరామ్ లపై కేసులు పెట్టాలని కోర్టు ఆదేశించింది. ఫిల్మ్ నగర్ లోని డక్కన్ కిచెన్ కూల్చివేతకు సంబంధించి కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది.

డక్కన్ కిచెన్ యజమాని నందకుమార్ దాఖలు చేసిన కేసుపై నాంపల్లి కోర్టు సోమవారం విచారణ చేపట్టింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి దగ్గుబాటి కుటుంబ సభ్యులు డక్కన్ కిచెన్ కూల్చివేశారని, 60మంది బౌన్సర్లను పెట్టి కోట్ల రూపాయల విలువైన భవనాన్ని ధ్వంసం చేసి, ఫర్నిచర్ ను ఎత్తుకెళ్లిపోయారని ఆయన ఆరోపించారు. తనకు రూ.20 కోట్ల మేరకు నష్టం వాటిల్లిందన్నారు. లీజు విషయంలో తనకు సానుకూలంగా కోర్టు ఆదేశాలు ఉన్నా దగ్గుబాటి కుటుంబ సభ్యులు లెక్కచేయలేదని నందకుమార్ పేర్కొన్నారు. బాధ్యులపై చర్య తీసుకోవాలని కోరారు. కేసును విచారించిన నాంపల్లి క్రిమినల్ కోర్టు… వెంకటేశ్, సురేశ్, రానా, అభిరామ్ లపై ఐపిసి 448, 452, 380, 506, 120బి కేసులు నమోదు చేయాలని ఆదేశించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News