Thursday, December 19, 2024

యువతిపై ఎస్ఐ అత్యాచారం.. కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వివాహం చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసిన ఎస్సైపై సైదాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….ఎస్సై అరుణ్ సైదాబాద్ పోలీస్ స్టేషన్‌లో ట్రైనీ ఎస్సైగా శిక్షణ సమయంలో పనిచేశాడు. ఇప్పుడు సిద్దిపేట పోలీస్ కమిషనరేట్‌లో ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఫిర్యాదు చేసేందుకు వచ్చిన బాధిత యువతి ఫోన్ నంబర్ తీసుకున్నాడు. తరచూ ఆమెతో మాట్లాడడంతో ప్రారంభించాడు.

తర్వాత ప్రేమిస్తున్నానని, వివాహం చేసుకుంటానని చెప్పి నమ్మించాడు. వివాహం చేసుకుంటానని పలుమార్లు యువతిపై అత్యాచారం చేశాడు. వివాహం చేసుకోవాలని యువతి పలుమార్లు కోరినా దాటవేస్తు వస్తున్నాడు. దీంతో యువతి వివాహం చేసుకుంటావా లేదా అని నిలదీయడంతో పెళ్లి చేసుకునేందుకు నిరాకరించాడు. తాను మోసపోయానని గ్రహించిన యువతి సైదాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సైగా పనిచేస్తున్న అరుణ్‌ను అరెస్టు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సైదాబాద్ పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News