- Advertisement -
హైదరాబాద్: సినీ నటుడు శ్రీ తేజ్ పై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తనని పెళ్లి చేసుకుంటానని మోసం చేశారని మొదట గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ లో బాధితురాలి ఫిర్యాదు చేశారు. అక్కడ జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. గతంలో కూడా ఓ బ్యాంకు ఉన్నతాధికారి భార్యతో శ్రీ తేజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఈ విషయం తెలిసి మహిళ భర్త గుండెపోటుతో మృతిచెందాడు. మాదాపూర్ పిఎస్‌లో మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు చేశారు. ఓ సినిమాలో చంద్రబాబుగా శ్రీతేజ్ నటించారు.
- Advertisement -