- Advertisement -
ఆగ్రా : జాతీయ పతాకాన్ని అవమానించినందుకు రాయల్ జామా మసీదు ముప్తీ ఖుబైట్ రూమీపై కేసు నమోదు చేసినట్టు మంటోలా పోలీసులు తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా మసీదులో జాతీయ జెండాను ఎగుర వేయడం ఇస్లాం వ్యతిరేక చర్య అని ప్రకటించినట్టు వచ్చిన ఫిర్యాదుపై ఈ చర్య తీసుకున్నట్టు చెప్పారు. రాయల్ జామా మసీదులో ఆగస్టు 15న ఉత్తరప్రదేశ్ మైనారిటీ కమిషన్ ఛైర్మన్ అష్పక్ సైఫీ నేతృత్వంలో స్థానికులు జాతీయ జెండాను ఎగుర వేశారు. దీన్ని ముఫ్తీ తీవ్రంగా ఖండించారు. ఇది ఇస్లాం వ్యతిరేక చర్య అని ప్రకటించారు.
- Advertisement -