Sunday, January 26, 2025

మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మరో బిఆర్ఎస్ ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. కోమరంభీం జిల్లా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై కేసు నమోదు అయ్యింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ప్రోటోకాల్ రగడ రోజురోజుకి ముదురుతోంది. కోమరభీం జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు, ఆసిఫాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే కోవా లక్ష్మీ మధ్య ప్రోటోకాల్ రగడ తారాస్థాయికి చేరింది. ప్రోటోకాల్ వివాదం వ్యక్తిగత ఘర్షణలకు దారి తీసింది. ఇరు పార్టీల కార్యకర్తలు ధర్నాలు రాస్తారోకోలు చేస్తుండగా, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు విశ్వప్రసాద్ రావు ఎమ్మెల్యే కోవా లక్ష్మీపై పోలీసులకు పిర్యాదు చేయగా పోలీసులు 296(B), 351(2) సెక్షన్ల కేసు నమోదు చేశారు. తొలుత బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై  భారత్ సంహిత్ న్యాయ్(బిఎస్ఎన్) యాక్ట్ సెక్షన్ 221, 126(2) కింద ఎమ్మెల్యేపై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News