Friday, April 11, 2025

ఎపి ఎంపి రఘురామపై గచ్చిబౌలి పిఎస్‌లో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case registered against AP MP Raghurama in Gachibowli PS

మనతెలంగాణ/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ నరసాపురం ఎంపి రఘురామపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈక్రమంలో ఎపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు ఆయనపై గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో రఘురామ కుమారుడు భరత్, పిఎ శాస్త్రి, సిఆర్‌పిఎఫ్ ఎఎస్‌ఐ, కానిస్టేబుల్‌ను నిందితులుగా చేర్చారు. విధి నిర్వహణలో భాగంగా తాను బౌల్డర్ హిల్స్ వద్ద ఉండగా నలుగురు వ్యక్తులు వచ్చి తనను కారులో ఎక్కించుకొని రఘురామ ఇంట్లోకి తీసుకెళ్లి, చిత్రహింసలకు గురి చేశారని ఎపి ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ ఎస్‌కె ఫరూక్ భాషా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎంపి రఘురామ వద్ద సెక్యూరిటీగా ఉన్న సిబ్బంది తన వద్ద పర్సు, ఐడీ కార్డు లాగేసుకున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రధాని భద్రతా విధుల్లో ఉండగా తనపై దాడి చేశారని, ఎంపి రఘురామ ఇంట్లో తనను 3 గంటల పాటు నిర్బంధించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో ఎంపి రఘురామ సహా ఐదుగురు నాపై దాడి చేశారని, అందరూ చూస్తుండగానే తనపై దాడి చేసి కారులో బలవంతంగా తీసుకెళ్లారు. తాను ఎపిలో ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నానని చెప్పినా వినలేదన్నారు. దాడి చేసిన సమయంలో ఐడీ కార్డు, పర్స్ లాక్కుని చిత్రహింసలకు గురిచేశారని, ఎపి మరో ముగ్గురు లాఠీలతో కొట్టి దుర్భాషలాడారని కానిస్టేబుల్ ఫరూక్ భాషా గచ్చిబౌలి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో వివరించాడు.

రక్షించిన గచ్చిబౌలి పోలీసులు 

రఘురామ కుమారుడు భరత్ సిఆర్‌పిఎఫ్ కానిస్టేబుళ్లు దాడి చేస్తున్న విషయం తెలియగానే గచ్చిబౌలి పోలీసులు రక్షించారని ఎపికి చెందిన కానిస్టేబుల్ ఫరూక్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో విధి నిర్వహణలో తనపై ఎంపి రఘురామకృష్ణరాజు కుటుంబ సభ్యులు ఘాతుకానికి పాల్పడ్డాడని గచ్చిబౌలి పోలీసులు రాగానే వారికి అప్పగించారని తెలిపారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News