Sunday, December 22, 2024

యువతిపై అత్యాచారం, ఆపై గర్భస్రావం.. ఎఎస్‌పిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

లక్నో : 23 ఏళ్ల యువతిపై అనేక సంవత్సరాలపాటు అత్యాచారానికి పాల్పడమే కాక, బలవంతంగా గర్భస్రావం చేయించడం, బెదిరించడం వంటి నేరాల కారణంగా అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ పై ఉత్తరప్రదేశ్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు. బాధితురాలు యుపిఎస్‌సి అభ్యర్థి. తన ఆరోపణలన్నిటికీ తగిన సాక్షాధారాలున్నాయని బాధితురాలు పోలీస్‌లకు ఫిర్యాదు చేసింది. నిందితుడు ఎఎస్‌పిని తక్షణం సస్పెండ్ చేయాలని డిమాండ్ చేసింది. ఈ విషయమై చర్య తీసుకోవాలని గత మూడు నెలలుగా పోలీస్‌లను డిమాండ్ చేస్తోంది. అయితే సామాజిక మాధ్యమాల్లో బాధితురాలు ఈ సంఘటన షేర్ చేసిన తరువాత కేసు నమోదైంది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం ఎఎస్‌పి రాహుల్ శ్రీ వాస్తవ యాంటీ టెర్రరిస్ట్ స్కాడ్ (ఎటిఎస్)లో నియామకమయ్యాడు.

ఐదేళ్ల క్రితం బాధితురాలు ఐదేళ్ల క్రితం యుపిఎస్‌సి సివిల్ సర్వీస్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న సమయంలో శ్రీవాస్తవతో పరిచయమైంది. అప్పటినుంచి లైంగికంగా ఆమెతో సంబంధాలు పెట్టుకోవడంతో గత ఏప్రిల్‌లో ఆమె గర్భవతి అయింది. అయితే బలవంతంగా గర్భస్రావం చేయించాడని బాధితురాలు పేర్కొంది. అంతేకాకుండా ప్రైవేట్ వీడియోలు తీసి బెదిరిస్తున్నాడని ఫిర్యాదు చేసింది. ఎఎస్‌పి భార్య మానిని శ్రీవాస్తవ, నలుగురు స్నేహితులపై కూడా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. దీనిపై దర్యాప్తు ప్రారంభించామని సాక్షాధారాల ప్రకారం చట్టపరంగా చర్యలు తీసుకుంటామని గోంతీనగర్ విస్తార్ పోలీస్ స్టేషన్ ఆఫీసర్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News