- Advertisement -
హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్‌పై కేసు నమోదయ్యింది. నగరంలోని బంజారాహిల్స్ పిఎస్‌లో అర్వింద్‌పై కేసు నమోదు చేశారు. సిఎం కెసిఆర్ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారని పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో ఐపిసి 504,55(2),506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నవంబర్ 8న ప్రెస్‌మీట్‌లో సిఎం మీద అర్వింద్ అనుచిత వ్యాఖ్యలు చేశారని బంజారాహిల్స్ పిఎస్‌లో బోయినపల్లికి చెందిన వ్యాపారి కల్యాణ్ సందీప్ ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అర్వింద్‌పై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
- Advertisement -