Sunday, December 22, 2024

సిఎం రేవంత్ రెడ్డిని అవమానించిన వారిపై కేసులు

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీ కార్యక్రమంపై బిఆర్ఎస్ నాయకులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. రుణమాఫీ పూర్తి చేశామని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారని..కానీ, కొంతమంది రైతులకు మాత్రమే మాఫీ జరిగిందని.. ఇంకా 54 శాతం మంది రైతులకు మాఫీ కాలేదని బిఆర్ఎస్ ఆందోళనలు చేపట్టింది. గ్రామాల్లో రైతులతో కలిసి ధర్నాలు చేస్తున్నారు. అంతే కాదు సిఎం రేవంత్ రెడ్డి.. రైతులను మోసం చేశారని ఆయన శవయాత్రను నిర్వహించారు.

ఆదిలాబాద్(D) తలమడుగు మండలం రుయ్యాడిలో సిఎం రేవంత్ రెడ్డిని అవమానిస్తూ.. బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో శవయాత్ర పేరిట నిరసన చేపట్టారు.  దీంతో సీఎంను కించపరిచేలా వ్యవహరించిన 11 మంది బీఆర్ఎస్ నాయకులు, రైతులపై పోలీసులు కేసు నమోదు చేశారు. సిఎంను అవమానించేలా వ్యవహరించడం అప్రజాస్వామికమని.. బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని పోలీసులు హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News