Wednesday, January 22, 2025

బిఆర్‌ఎస్ నాయకుడిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

తహసిల్దార్‌ను బెదిరించిన బిఆర్‌ఎస్ నాయకుడిపై నార్సింగి పోలీసులకు కేసు నమోదు చేశారు. మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని నెక్నాంపూర్ పెద్దచెరువు(ఇబ్రహీంబాగ్ చెరువు) బఫర్ జోన్‌లో నిర్మించిన విల్లాలను రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల అధికారులు కూల్చివేశారు. చెరువు ఆక్రమణలపై రంగారెడ్డి జిల్లా కలెక్టర్ శశాంకకు ఫిర్యాదులు రావడంతో కూల్చివేయాలని ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాల మేరకు విల్లాలు కూల్చేందుకు భారీ పోలీస్ బందోబస్తుతో వచ్చిన అధికారులు కూల్చివేతలు చేపట్టారు. బఫర్ జోన్‌లో ఉన్న విల్లాలతోపాటు పిల్లర్లు,

విల్లాల చుట్టూ నిర్మించిన ప్రహరీ గోడను ప్రొక్లెయిన్లతో కూల్చివేశారు. కూల్చివేతలు చేపట్టిన అధికారులపై బిఆర్‌ఎస్ నాయకుడు పల్లపు గోవర్ధన్‌తో పాటు అతడి అనుచరులు రాళ్లు రువ్వేందుకు ప్రయత్నించారు. అక్కడి నుంచి గండిపేటలోని తహసిల్దార్ కార్యాలయానికి వెళ్లి ఛాంబర్‌లో కూర్చొని తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డిని బెదిరించాడు. తన పేరు చెప్పినా వినకుండా విల్లాలు కూల్చివేస్తావా, ఎంత ధైర్యం అని బెదిరించాడు. దీంతో తహసిల్దార్ శ్రీనివాస్ రెడ్డి నార్సింగి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు తీసుకున్న నార్సింగి పోలీసులు బిఆర్‌ఎస్ నాయకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News