Monday, December 23, 2024

బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ పాడి కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్: ప్రముఖ పుణ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయ ప్రాంగణంలో బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై పఠాన్ చెరువు పోలీస్ స్టేషన్లో సోమవారం కేసు నమోదయింది. పవిత్ర ఆలయ నిబంధనలకు విరుద్ధంగా కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి సినిమా పాటలకు రీల్స్ చేయడంపై పలు హిందూ సంఘాలు మండిపడ్డాయి.

ఈ క్రమంలో సోమవారం విశ్వ హిందూ పరిషత్ నేత సుభాష్ చంద్ర పఠాన్ చెరువు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఒక బాధ్యత గల పదవిలో ఉండి, కౌశిక్ రెడ్డి ఇలా వ్యహరించడం సరికాదని, రేపు మరింత మంది రీల్స్ చేయడానికి ఎగబడతారని సుభాష్ చంద్ర అన్నారు. హిందూ దేవాలయాల పవిత్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిది అని గుర్తు చేస్తూ ఇంకోసారి ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడకుండా చూడాలని పోలీసులను కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News