Thursday, January 23, 2025

కాంగ్రెస్ ఎమ్మెల్యేపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

 

జలంధర్: లోక్‌సభ ఉప ఎన్నిక సందర్భంగా మే 10వ తేదీ నాడు జలంధర్‌లో ఏడుగురు ఆప్ ఎమ్మెల్యేలు అక్రమంగా తిష్టవేయడాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేపై పంజాబ్ పోలీసులు నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పంజాబ్‌లోని షాహ్‌కోట్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే హర్దేవ్ సింగ్ లడ్డీ షేరోవాలియా, ఆయన అనుచరులపై పోలీసులు వివిధ సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.

మే 10న జలంధర్ లోక్‌సభ స్థానం ఉప ఎన్నికకు సంబంధించిన ఓటింగ్ జరిగింది. బాబా బకాలాకు చెందిన ఆప్ ఎమ్మెల్యే దల్బీర్ సింగ్ టోంగ్ రూపేవాల్ గ్రామంలో ఉండడంతో ఆయనను ఘెరావ్ చేసిన షేరోవాలియా ఫేస్‌బుక్‌లో దీన్ని లైవ్ ప్రసారం చేశారు. టోంగ్‌పై ఐపిసి సెక్షన్ 188 కింద కేసు బుక్ చేయించారు. అయితే టోంగ్ కాన్వాయ్‌కు చెందిన డ్రైవర్ ఒకరు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మే 10వ తేదీ రాత్రి షేరోవాలియాపై నాన్ బెయిల్‌బుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాబా బకాలా నుంచి సుల్తాన్‌పురి లోడికి నకోదర్ మీదుగా తాము వెళుతుండగా దారిలో ట్రాఫిక్ జామ్ అయిందని, తాము రూపేవాల్ గ్రామం మీదుగా కార్లను మళ్లించామని డ్రైవర్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో తెలిపాడు. ఆప్ ఎమ్మెల్యే టోంగ్‌ను అడ్డగించి ఘెరావ్ చేయడమేగాక కారు తాళాలు లాక్కున్నారని డ్రైవర్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు కాంగ్రెస్ ఎమ్మెల్యే టోంగ్‌పై కేసు నమోదు చేశారు.

Also Read: యువజంట ముద్దులు…. ఢిల్లీ మెట్రో సుద్దులు (వీడియో వైరల్)

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News