Sunday, December 22, 2024

ఎంఎల్‌ఎ లాస్యనందిత కారు డ్రైవర్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఎంఎల్‌ఎ లాస్య నందిత కారు ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారు డ్రైవర్ ఆకాష్‌పై లాస్య సోదరి నివేదిత ఫిర్యాదు చేశారు. ఆకాష్ 304ఎ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ముందు వెళ్తున్న వాహనాన్ని ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు ఆర్‌టిఎ అధికారులు, పోలీసులు నిర్ధారణకు వచ్చారు. ప్రస్తుతం డ్రైవర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు పోలీస్‌స్టేషన్ పరిధిలో ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్)పై జరిగిన రోడ్డు ప్రమాదంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ లాస్య నందిత (37) దుర్మరణం చెందిన విషయం తెలిసిందే.

ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే గురువారం రాత్రి 11 గంటల సమయంలో లాస్య నందిత తన కుటుంబ సభ్యులతో కలిసి రెండు కార్లలో సదాశివపేట మండలం ఆరూర్‌లోని మిస్కిన్ షా బాబా దర్గాను సందర్శించారు. తిరిగి హైదరాబాద్ చేరుకున్నారు. హైదరాబాద్ చేరుకున్నానంతరం శుక్రవారం ఉదయం లాస్య నందిత అల్పాహారం తినాలంటూ షామీర్ పేట వద్ద ఓఆర్‌ఆర్ ఎక్కి, సంగారెడ్డి వైపు కారుత లో వస్తుండగా తెల్లవారు జామున సుమారుగా 5.10 గంటల సమయంలో సుల్తాన్‌పూర్ టోల్ ప్లాజా దాటిన తర్వాత లాస్య నందిత పిఎ, కారు నడుపుతున్న ఆకాశ్ ఆకస్మాత్తుగా నిద్ర మత్తులోకి జారుకోవడంతో ఎడమవైపు ఉన్న ఓఆర్‌ఆర్ మెట్‌బీమ్‌కు బలంగా ఢీకొనడంతో ఎంఎల్‌ఎ అక్కడికక్కడే మృతి చెందారని పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News