Monday, December 23, 2024

గ్రీన్ మంకీ పబ్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case registered against Green Monkey Pub

హైదరాబాద్ : హైకోర్టు నిబంధనలు ఉల్లంఘించిన గ్రీన్ మంకీ పబ్బుపై జూబ్లీహిల్స్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 36లోని గ్రీన్ మంకీ పబ్ నిర్వాహకులు రాత్రి 10.30 గంటలకు కూడా సౌండ్ పెట్టారు. దీంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు పబ్‌లో సౌండ్ నడుస్తుండడంతో వెంటనే కేసు నమోదు చేశారు. పబ్బు మేనేజర్‌ను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News