Friday, December 20, 2024

యూట్యూబర్ హర్షసాయి ఫౌండేషన్‌ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హర్షసాయికి మరో బిగ్ షాక్ తగిలింది. తాజాగా హర్షసాయిపై మరో కేసు నమోదయింది. హర్షసాయి ఫౌండేషన్‌పై రాచకొండ సైబర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తనను సహాయం పేరుతో రూ. 5.4 లక్షలు వసూలు చేసి మోసం చేశాడని బాధితుడు ఫిర్యాదు చేశాడు. దీంతో హర్షపై 406,419,420,66-సి, 66డి సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు హర్షసాయి చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

హర్షసాయిపై ఇప్పటికే అత్యాచారం కేసు నమోదైన సంగతి తెలిసిందే. హర్షసాయి తనపై లైంగి కంగా దాడి చేశాడని ఓ యువతి నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో నార్సింగి పోలీసులు అతడిపై అత్యాచారం కేసు నమోదు చేశారు. హర్షసాయి అత్యాచారం కేసును పోలీసులు సీరియస్‌గా తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. తనంతట తాను పోలీసులకు లొంగిపోకపోతే హర్షసాయిపై పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News