- Advertisement -
టాలీవుడ్ ప్రముఖ హీరో వెంకటేశ్ ఫ్యామిలీపై కేసు నమోదు అయ్యింది. ఫిల్మ్‌నగర్‌లోని దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేత కేసులో నాంపల్లి కోర్టు ఆదేశాల మేరకు దగ్గుబాటి కుటుంబసభ్యులైన వెంకటేశ్, సురేశ్ బాబు, రానా, అభిరామ్ లపై ఫిల్మ్ నగర్ పోలీసులు.. 448, 452, 458, 120బి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపాలని పోలీసులను కోర్టు ఆదేశించింది.
దగ్గుబాటి ఫ్యామిలీకి చెందిన స్థలాన్ని నందకుమార్ అనే వ్యక్తి లీజుకు తీసుకుని దక్కన్ కిచెన్ హోటల్ ను నడిపాడు. ఈ తర్వాత యజమాని, దగ్గుబాటి ఫ్యామిలీకి మధ్య వివాదం నెలకొంది. తన హోటల్ ను కూల్చివేయడంతో దాదాపు రూ.20 కోట్ల నష్టం వచ్చిందని, తనకు న్యాయం చేయాలని అతను కోర్టును ఆశ్రయించాడు. ఈ క్రమంలో న్యాయస్థానం ఆదేశాల మేరకు పోలీసులు దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేశారు.
- Advertisement -