Wednesday, January 22, 2025

మాజీ ఎంఎల్‌ఎ, మాజీ డిప్యూటీ మేయర్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : కొడంగల్ మాజీ ఎంఎల్‌ఎ పట్నం నరేందర్‌రెడ్డి, హైదరాబాద్ మాజీ డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ సహా మరో ఆరుగురిపై కేసు నమోదైంది. బాబా ఫసియుద్దీన్ దాడి చేశారని నారాయణపేట జిల్లా కోస్గికి చెందిన బాధితుడు నరేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌కు మద్దతు ఇస్తే చంపేస్తామని బెదిరించారని పోలీసులకిచ్చిన ఫిర్యాదులో నరేష్ పేర్కొన్నారు. కాగా రెండు రోజుల నుంచి కోస్గి, బోరబండ పోలీసులు బాబా ఫసియుద్దీన్ కోసం గాలిస్తున్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కోస్గి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News