Wednesday, January 22, 2025

కెఎ పాల్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ప్రజాశాంతి పార్టీ ఎల్‌బి నగర్ ఎమ్మెల్యే టికెట్ ఇస్తామని చెప్పి ఆ పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ రూ.50లక్షలు తీసుకున్నాడని ఓ వ్యక్తి పంజాగుట్ట పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. పోలీసుల కథనం ప్రకారం..రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్‌కుమార్ అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఎల్‌బి నగర్ టికెట్ ఇస్తామని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్ చెప్పాడని తెలిపాడు.

టికెట్ కేటాయించాలంటే ముందుగా రూ.50లక్షలు ఇవ్వాలని చెప్పాడని, దానికి అంగీకరించి ఆన్‌లైన్‌లో రూ.30లక్షలు, రూ.20లక్షల నగదు క్యాష్ రూపంలో పలు దఫాలుగా చెల్లించానని పేర్కొన్నాడు. కానీ తనకు టికెట్ ఇవ్వకుండా మోసం చేశాడని తెలిపాడు. తనను మోసం చేసిన కెఎ పాల్‌పై చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులను కోరాడు. ఫిర్యాదు తీసుకున్న పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News