Wednesday, December 25, 2024

కౌశిక్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

కరీంనగర్: హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి నేడు(ఆదివారం) పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 9వ తేదీన దళితబంధు లబ్ధిదారులతో హుజూరాబాద్‌లో అనుమతి లేకుండా ధర్నా చేశారని పోలీసులు తెలిపారు. ఈ మేరకు కౌశిక్ రెడ్డికి హుజురాబాద్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. కౌశిక్‌రెడ్డితో పాటు పలువురు బిఆర్ఎస్ నేతలపై కేసు నమోదు చేశారు. సెక్షన్‌ 35(3) BNS యాక్ట్‌ కింద హుజూరాబాద్‌లో కేసు నమోదు చేసినట్లు నోటీసులో పోలీసులు పేర్కొన్నారు.

దళిత బంధు రెండో విడత డబ్బులు రాని వారు తమ ఇంటికి వచ్చి దరఖాస్తు చేసుకోవాలని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో లబ్ధిదారులు ఎమ్మెల్యే ఇంటికి పెద్దఎత్తున తరలివచ్చారు. హుజూరాబాద్‌ అంబేడ్కర్‌ చౌరస్తా వద్ద తాము చేపట్టిన ధర్నాలో పాల్గొనాలని లబ్ధిదారులు కౌశిక్‌రెడ్డిని కోరారు. దీంతో అందరూ కలిసి ర్యాలీగా చౌరస్తాకు చేరుకుని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News