Thursday, January 23, 2025

కెటిఆర్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌పై కేసు నమోదైంది. కెటిఆర్‌తో పాటు బాల్క సుమన్, గండ్ర వెంకటరమణా రెడ్డిలపై భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ పీఎస్‌లో బీఎన్‌ఎస్ 223(b) కింద ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని మేడిగడ్డ బ్యారేజ్ డ్రోన్ వీడియోపై ఈ కేసు నమోదైంది. గత నెల 26న మేడిగడ్డ బ్యారేజ్‌ను బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్, పార్టీ ముఖ్య నాయకులు సందర్శించారు. కెటిఆర్ పర్యటనలో అనుమతులు లేకుండా బిఆర్‌ఎస్ శ్రేణులు డ్రోన్ ఎగురవేశారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు డ్రోన్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఇరిగేషన్ ఎఇఇ ఫిర్యాదుతో మహదేవ్‌పూర్ పిఎస్‌లో ఈ మేరకు కేసు నమో దైంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News