Tuesday, January 21, 2025

కెటిఆర్, హరీష్ రావుపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఎమ్మెల్యేలు కేటిఆర్, హరీష్ రావుపై సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎంపి రఘునందన్ రావు, తెలంగాణ రాష్ట్ర మంత్రి కొండా సురేఖపై బిఆర్‌ఎస్‌కు చెందిన సోషల్ మీడియా టీం ట్రోలింగ్ చేశారు. దీనిపై మంత్రి కొండా సురేఖ, ఎంపి రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటిఆర్, హరీష్ రావులే తమ అనుచరులతో సోషల్ మీడియాలో అసభ్యంగా ట్రోలింగ్ చేయించారని మంత్రి సురేఖ, ఎంపి రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు రఘునందన్‌రావు సైబరాబాద్ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News