Monday, January 20, 2025

మాజీ మంత్రి కెటిఆర్, ఎంఎల్‌ఎ పద్మారావు గౌడ్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీ మంత్రి కెటిఆర్‌పై కేసు నమోదు అయ్యింది. అనుమతి లేకుండా చార్మినార్ వద్ద నిరసన తెలపడంతో కెటిఆర్‌పై చార్మినార్ స్టేషన్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కేటీఆర్‌తో పాటు బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు మాగంటి గోపినాథ్, పద్మారావు గౌడ్, పొన్నాల లక్ష్మయ్య ఇతర నాయకులపై సెక్షన్ 188 కింద కేసు రిజిస్టర్ అయ్యింది. కాగా, కాంగ్రెస్ ప్రభు త్వం రాష్ట్ర అధికారిక చిహ్నాంలో మార్పులు చేస్తోన్న విషయం విదితమే. ప్రస్తుతం లోగోలో ఉన్న కాకతీయ కళాతోరణం, చార్మినార్‌ను తొలగించి,

వాటి స్థానాల్లో కొత్త డిజైన్ రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. లోగోలో మార్పులు చేస్తూ రేవంత్ రెడ్డి సర్కార్ తీసుకున్న నిర్ణయంపై బిఆర్‌ఎస్ భగ్గుమం టోంది. తెలంగాణ అస్థిత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ వ్యవహారిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర లోగోలో మార్పులను నిరసిస్తూ గురువారం మాజీ మంత్రి కెటిఆర్, ఎంఎల్‌ఎలు చార్మినార్ వద్ద ధర్నా చేపట్టారు. ఈ క్రమంలోనే అనుమతి లేకుండా చార్మినార్ వద్ద ఆందోళన చేశారని పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News