Monday, November 18, 2024

ఎంఎల్‌ఎ కూనంనేనిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కారణంగా కొత్తగూడెం ఎంఎల్‌ఎ కూనంనేని సాంబశివరావుపై కేసు నమోదైంది. పాల్వంచ ఎంపిడిఒ విజయ భాస్కర్ రెడ్డి ఫిర్యాదు మేరకు పాల్వంచ రూరల్ పోలీసులు కూనంనేనిపై కేసు నమోదు చేశారు. గత నెల 23వ తేదీన మండల పరిధిలోని పలు గ్రామ పంచాయతీల్లో కూనంనేని విస్తృతంగా పర్యటించి, తన అనుచరులతో కలిసి సమావేశాలు నిర్వహించారు.

ఎన్నికల అధికారులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే ఆయా సమావేశాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఎన్నికల హామీలు ఇచ్చారనే అభియోగంపై స్థానిక బిఎస్‌పి నాయకుడు యర్రా కామేష్ ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఆయన ప్రజలను ప్రభావితం చేసేలా ప్రసంగం చేశారని ఆరోపించారు. కూనంనేని ప్రసంగాలు ఓటర్లను ప్రభావితం చేసేలా ఉద్వేగ భరితంగా ఉన్నాయని ఫిర్యాదులో వెల్లడించారు. ఈ మేరకు స్పందించిన ఎంపిడిఒ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రూరల్ పోలీసులు 188, 171సి సెక్టన్ల కింద కూనంనేనిపై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News