Saturday, December 21, 2024

అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు రాజాసింగ్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

వనపర్తి: బిజెపి ఎంఎల్ఏ టి. రాజా సింగ్ పై ఓ వర్గంపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను కేసు నమోదయింది. పోలీసుల కథనం ప్రకారం బిజెపి ఎంఎల్ఏ రాజాసింగ్ పై కొత్తకోట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది. ‘ఈ నెల 23న ఛత్రపతి శివాజీ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం చివర్లో రాజాసింగ్ ప్రసంగిస్తూ ఓ వర్గంపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానిపై ఈ నెల 25న కొందరు ముస్లిం పెద్దలు ఫిర్యాదు చేశారు. దాంతో  సెక్షన్ 295 ఏ కింద కేసు నమోదయింది’ అని కొత్తకోట పోలీస్ స్టేషన్ సబ్-ఇన్ప్సెక్టర్ మంజునాథ్ రెడ్డి తెలిపారు. టి.రాజాసింగ్ గోషామహల్ నియోజకవర్గం  ఎంఎల్ఏ.

ఇదిలావుండగా సిద్దిపేటలో మంగళవారం బిజెపి, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చేసుకున్నాయన్నది ఇక్కడ గమనార్హం. బిజెపి పార్లమెంటు సభ్యుడు బండి సంజయ్ కుమార్ ప్రజాహిత యాత్ర నిర్వహిస్తుండగా ఆ రెండు పార్టీల కార్యకర్తల మధ్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. బిజెపి వారి కథనం ప్రకారం సిద్దిపేట జిల్లాలోకి ప్రజాహిత యాత్ర ప్రవేశించగానే కాంగ్రెస్ కు చెందిన వారు ఘర్షణలకు దిగారు. ఆ యాత్రను అడ్దుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు బందోబస్తు మధ్య బండి సంజయ్ యాత్రను హుస్నాబాద్ నియోజకవర్గంలో కొనసాగించారు. ‘నాకు మీపై గౌరవం ఉంది. మీరు అనుకుంటున్నట్లు నేనేమి పిరికివాడిన కాను. బిఆర్ఎస్ వాళ్ల మాదిరి మీరు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేసినా నేను వెరువను’ అని బండి సంజయ్ ఆ సందర్భంగా అన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News