టాలీవుడ్ ప్రముఖ సీనియర్ నటుడు మంచు మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైంది. మంచు కుటుంబం గొడవల నేపథ్యంలో కవరేజ్ కోసం వెళ్లిన ఓ జర్నలిస్ట్ పై మోహన్ బాబు చేయి చేసుకున్నారు. దీంతో ఆయన చిక్కుల్లో పడ్డారు. జర్నలిస్ట్ ను కొట్టడాన్ని కొంతమంది తప్పుబడుతున్నారు. అయితే.. మరికొందరు మాత్రం ఇంకా రెండు తన్నాల్సింది అని మోహన్ బాబుకు మద్దతు తెలిపారు. వాళ్ల ఫ్యామిలీ మ్యాటర్ లోకి చొరపడేందుకు.. ఇంట్లో దూసుకెళ్లిందే కాక.. ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ మీడియాపై మండిపడుతున్నారు.
అయితే, ఈ దాడిపై విచారణకు రావాలని ఇప్పటికే రాచకొండ సీపీ మోహన్ బాబుకు నోటీసులు ఇచ్చారు. దీంతో ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో ఈ నెల 24వరకు నోటీసులపై స్టే విధించింది. తాజాగా పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్‌బాబుపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. మొదట 118 (1) సెక్షన్ కింద కేసు నమోదు చేయగా.. లీగల్ ఒపీనియన్ తీసుకుని సెక్షన్ మార్పు చేశారు. 109 సెక్షన్ నమోదు తెలుస్తోంది.