- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : పుట్టిన రోజును పురస్కరించుకుని ముజ్రా పార్టీ నిర్వహించిన వారిపై మీర్‌చౌక్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…రెయిన్‌బజార్‌కు చెందిన సయిద్ ఆరిఫ్ కుమారుడు సయిద్ యాసిన్ అర్‌ఫత్ పుట్టిన రోజు సందర్భంగా బుధవారం ముజ్రా పార్టీని ఏర్పాటు చేశారు. ఈ వేడుకలకు పలువురు స్నేహితులు, బంధువులు హాజరయ్యారు. దీంతో మంజుమియా ఇంటి ఎదుట హడావుడి చేయడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు. పలువురు డయల్ 100కు ఫోన్ చేయడంతో వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. న్యూసెన్స్ చేసిన సయిద్ ఆరిఫ్, సయిద్ యాసిన్ ఆర్‌ఫత్, సాజిద్, ఫిరోజ్, అక్రం, హఫీజ్‌పై కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
- Advertisement -