- Advertisement -
మన తెలంగాణ, హైదరాబాద్ : సినీ నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళిపై రాజమహేంద్రవరం పోలీసులు కేసు నమోదు చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ గతంలో జనసేన పార్టీ నాయకురాలు యందం ఇందిరా రాజమహేంద్రవరం ఒన్ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
అయితే పోలీసులు కేసు నమోదు చేయలేదు. దీంతో ఆమె స్థానిక కోర్టును ఆశ్రయించారు. రెండో జెఎఫ్‌సిఎం కోర్టులో యందం ఇందిరా తరపున న్యాయవాది రామచంద్రరావు వాదనలు వినిపించారు. చివరకు పోసానిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను కోర్టు ఆదేశించింది. దీంతో పోసాని కృష్ణ మురళిపై ఐపీసీ 354,355, 500, 504, 506, 507, 509 సెక్షన్ల కింద కేసులను రాజమహేంద్రవరం ఒన్ టౌన్ పోలీసులు నమోదు చేశారు.
- Advertisement -