Tuesday, December 3, 2024

రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు..

- Advertisement -
- Advertisement -

వివాదాస్ప దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మపై కేసు నమోదు అయ్యింది. ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీస్‌ స్టేషన్‌లో ఐటీ చట్టం కింద ఆర్జీవిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ముందు ‘వ్యూహం’ సినిమా ప్రమోషన్స్‌ సమయంలో అప్పటి ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు కుటుంబంపై అసభ్యకర పోస్టులు పెట్టినట్లు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి రామలింగం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సీఎం చంద్రబాబు, నారా లోకేశ్‌, బ్రాహ్మణి వ్యక్తిత్వాలను కించపరిచేలా ఆయన సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టారని.. అందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో వర్మపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News