Thursday, January 23, 2025

కేంద్ర మంత్రి అమిత్‌షాపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ఎన్నికల నిబంధనలు ఉల్లఘించారని కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో కేంద్ర మంత్రి అమిత్‌షాపై నగరంలోని మోఘల్‌పుర పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ జి.నిరంజన్ ప్రధాన ఎన్నికల అధికారికి మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల1వ తేదీన పాతబస్తీలో కేంద్రహోం మంత్రి ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సమయంలో ఓ చిన్నారి చేతిలో ఉన్న బ్యానర్‌పై బిజేపికి చెందిన బ్యానర్‌పై కమలం పువ్వు గుర్తు ఉంది. ఇద్దరు చిన్నారుల చేతిలో ఉన్న ప్లకార్డులపై ఆప్ కీ బాత్ 400 సీట్స్ అంటూ రాసి ఉంది. మైనర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించవద్ద ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.

హైదరాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి మాధవిలత మాట్లాడే సమయంలో కొంత మంది బాలికలు వేదికపైకిప రావడంతో అమిత్ షా చిన్నారులకు తన వద్దకు రమ్మంటు సైగ చేయడంతో చిన్నారులు మంత్రి వద్దకు వెళ్లారు. ఫిర్యాదు పై స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. దీనిపై సౌత్ జోన్ డిసిపి స్నేహామెహ్రా విచారణ జరిపి పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డికి నివేదిక సమర్పించారు. కమిషనర్ ఆదేశాల మేరకు మొఘల్‌పురా పోలీసులు 188 ఐపీసీ క్రింద కేసు నమోదు చేశారు. యమాన్ సింగ్, హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవి లత, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఎమ్మెల్యే రాజాసింగ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News