- Advertisement -
ఖమ్మం: నకిలీ విత్తన విక్రయాలపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. లైసెన్స్ లేకుండా మిరప విత్తనాలు రైతులకు విక్రయిస్తున్న ఎనిమిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.16 లక్షలు విలువైన నకిలీ విత్తనాలు సీజ్ చేశామని సిపి విష్ణువారియర్ తెలిపారు. సత్తుపల్లి సర్కిల్‌లోని కల్లూరు, ఏన్కూర్, జూలూరుపాడు, చండ్రుగొండలో నకిలీ విత్తనాల అమ్మకాలు జరుగుతున్నాయన్నారు. నకిలీ విత్తనాలు విక్రయించే మరికొంత మందిని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. కర్నాటకకు చెందిన ఓ వ్యక్తి నకిలీ విత్తనాల విక్రయంలో కీలకంగా ఉన్నాడని, నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై పిడి యాక్టు కేసులు నమోదు చేస్తామని సిపి హెచ్చరించారు. రైతులు రశీదులు లేకుండా ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేయొద్దని సూచించారు. నకిలీలు ఛేదించడంలో ప్రతిభ చూపిన అధికారులకు అభినందనలు అన్నారు.
- Advertisement -