Tuesday, January 21, 2025

ఆ వ్యాఖ్యలు చేసినందుకు అద్దంకి దయాకర్‌పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

నిర్మల్: ఆదిలాబాద్ సభలో శ్రీరాముడు, హిందువులపై కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడంతో ఆయనపై బిజెపి నేతలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిర్మల్ పోలీస్ స్టేషన్‌లో ఐపిసి సెక్షన్ 504, 505/2 కింద అతడిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ సభలో అద్దంకి దయాకర్ హిందు దేవుళ్లపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బిజెపి, ఇతర హిందువులు రాముని వారసులు అని చెప్పుకుంటున్నారని, మీరు ఏవిదంగా రాముడి వారసులు అవుతారని ప్రశ్నించారు. రాముడు మీకు చిన్నాయన, సీత మీకు చిన్నమ్మన అని అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో హిందూ సంఘాలు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. తన వ్యాఖ్యలను కావాలనే వక్రీకరించారని అద్దంకి దయాకర్ ఓ వీడియోను విడుదల చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News