Monday, December 23, 2024

ఔరంగజేబును కీర్తిస్తూ వాట్సాప్ స్టేటస్: వ్యక్తిపై కేసు

- Advertisement -
- Advertisement -

 

 

న్యూస్ డెస్క్: నా సెల్‌ఫోన్ నా ఇష్టం అంటే కుదరదు ఇక. మతాల మధ్య చిచ్చు పెట్టేలా, మత విద్వేషాలు రెచ్చగొట్టేలా మీ సెల్‌ఫోన్‌లో రాతలు రాసినా నేరమేనంటున్నారు పోలీసులు. మొఘల్ సామ్రాజ్యాధినేత ఔరంగజేబును కీర్తిస్తూ తన వాట్సాప్‌లో స్టేటస్ పెట్టినందుకు ఒక మైనారిటీ మతానికి చెందిన వ్యక్తిపై మహారాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. కొల్హాపూర్ జిల్లాలో ఈ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. ఒక వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా యాద్‌గావ్ పోలీసులు ఆ మైనారిటీ మతస్తుడిపై ఐపిసిలోని సెక్షన్ 295 కింద కేసు నమోదు చేశారు. ఔరంగజేబును కీర్తిస్తూ ఆ వ్యక్తి తన వాట్సాప్ స్టేటస్‌లో చేసిన వ్యాఖ్యలు మార్చి 16న వెలుగులోకి వచ్చినట్లు అధికారి ఒకరు తెలిపారు. ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నట్లు ఆ అధికారి చెప్పారు. సామాజిక మాధ్యమాలలో ఏ మతాన్ని కూడా కించపరుస్తూ ఎటువంటి పోస్టులు పెట్టవద్దని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News