Monday, December 23, 2024

3500 మంది బిజెపి కార్యకర్తలపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

 

న్యూస్‌డెస్క్: పోలీసుల ముందస్తు అనుమతి లేకుండా కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించినందుకు3,500 బిజెపి కార్యకర్తలపై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసిలోని సెక్షన్లు 151, ఆర్/దబ్లు 41(6) కింద బిజెపి కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు చెన్నై పోలీసు అధికారులు వెల్లడించారు. డిఎంకె ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెన్నైలో ఇటీవల తమిళనాడు బిజెపి అధ్యక్షుడు కె అన్నామలై నేతృత్యంలో పార్టీ కార్యకర్తలు కొవొవ్వత్తుల ప్రదర్శన నిర్వహించారు. సైనిక జవాన్‌ను డిఎంకె కౌన్సిలర్ ఒకరు నరికి చంపివేయడాన్ని నిరసిస్తూ బిజెపి కార్యకర్తలు, నాయకులు మంగళవారం చెన్నైలో కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా బుధవారం బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, మాజీ సైనికోద్యోగులు కొందరితో కలసి గవర్నర్ ఆర్‌ఎన్ రవిని రాజ్‌భవన్‌లో కలుసుకుని ఒక వినతిపత్రాన్ని సమర్పించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News