Wednesday, January 22, 2025

చంద్రబాబు సహా 20 మందికి పైగా టిడిపి నేతలపై కేసులు నమోదు…

- Advertisement -
- Advertisement -

అమరావతి: టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం, నేరపూరిత కుట్ర కింద పోలీసులు కేసు నమోదు చేశారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లులో ఇటీవల ఘర్షణ ఘటనలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ముదివీడు పోలీస్ స్టేషన్‌లో చంద్రబాబు సహా 20 మందికి పైగా టిడిపి నేతలపై కేసు నమోదు చేశారు. ఎ1గా చంద్రబాబు, ఎ2గా దేవినేని ఉమ, ఎ3గా అమర్నాథ్ రెడ్డి, ఎంఎల్‌సి రాంగోపాల్ రెడ్డి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, దమ్మాలపాటి రమేష్, రెడెప్పగారి శ్రీనివాస రెడ్డి, గంటా నరహరి, శ్రీరామ్ చినబాబు, పులవర్తి నాని, తదితరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమాపతి రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆగస్టు 4న మారణాయుధాలు, ఐరన్ రాడ్లు, ఇటుకలు, కర్రలతో వచ్చారని ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబుపై అన్నమయ్య జిల్లా ములకల చెరువు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. ఎ7గా చంద్రబాబుపై ములకల చెరువు పోలీసులు కేసు నమోదు చేశారు. వైసిపి కార్యకర్త చాంద్‌బాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్ షోలో రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

Also Read: 9వ తరగతి బాలికను లైంగికంగా వేధించి… తుపాకీతో కాల్చారు

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News