- Advertisement -
మంచిర్యాల: బెల్లంపల్లి బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ దుర్గం చిన్నయ్య ఎన్నికల కోడ్ ఉల్లంఘించడంతో అతడిపైకేసు నమోదైంది. బెల్లంపల్లిలోని నెన్నెల పోలీస్ స్టేషన్‌లో పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఆయన గులాబీ కండువా ధరించి పోలీంగ్ స్టేషన్‌కు వచ్చారు. నెన్నెల మండలం జెండా వెంకటపూర్‌లో తాను ఓటు వేస్తుండగా గులాబీ కండువా కప్పుకున్నారు. గులాబీ కండువాతో పోలింగ్ కేంద్రానికి వచ్చిన కూడా ఎన్నికల సిబ్బంది అడ్డుచెప్పలేకపోవడంతో విమర్శలు వస్తున్నాయి. ప్రిసైడింగ్ అధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
- Advertisement -