Wednesday, February 26, 2025

హీరోయిన్ మాధవీలతపై తాడిపత్రిలో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ / అమరావతి : సినీ నటి మాధవీలత, తాడిపత్రి టీడీపీ నేత, మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య వివాదం ముదురుతోంది. మాధవీలత ఫిర్యాదు మేరకు సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు జేసీపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మాధవీలతపై తాడిపత్రి పోలీసులు కేసు నమోదు చేశారు. తనను కించ పరిచే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నాయకురాలు, ఏపీ మాల కార్పొరేషన్ డైరెక్టర్ కమలమ్మ సినీనటి మాధవీలతపై తాడిపత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు సెక్షన్ 353 కింద మాధవీలతపై పోలీసులు కేసు నమోదు చేశారు. మాధవీలతకు జేసీ క్షమాపణలు కూడా చెప్పారు. ఆవేశంలో తాను తప్పుగా మాట్లాడానని, తనను క్షమించాలని కోరినా మాధవీలత తగ్గలేదు. ఈ క్రమంలోనే జేసీపై సైబరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు. తాజాగా మాధవీలతపై తాడిపత్రిలో కేసు నమోదైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News