Thursday, September 19, 2024

జానీ మాస్టర్ లైంగికంగా వేధించాడు: మహిళా కొరియోగ్రాఫర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: సినీ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ తనని లైంగికంగా వేధించాడని రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో మహిళా కొరియోగ్రాఫర్ ఫిర్యాదు చేశారు. పోలీసులు జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి నార్సింగి పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జాని మాస్టర్ గత కొంతకాలంగా తన మీద లైంగిక వేదింపులకు పాల్పడుతున్నట్లు మరో మహిళా కొరియోగ్రాఫర్ (21) పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై, ముంబై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో అవుట్‌డోర్ చేస్తున్నప్పుడు, నార్సింగి అక్కాపురి టౌన్ షిపులోని నివాసంలో కూడా జానీ మాస్టర్ తనపై అనేకసార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదు మేరకు రాయదుర్గం పోలీసులు జీరో ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేశారు. ఆమె నార్సింగి పరిధిలో నివసిస్తుండడంతో ఈ కేసును నార్సింగి పోలీసులకు కేసు బదిలీ చేశారు. అతడిపై ఐపిసి సెక్షన్ 376 (అత్యాచార), క్రిమినల్ బెదిరింపు (506), స్వచ్ఛందంగా గాయపరచడం (323)లోని క్లాజ్ (2), (ఎన్) కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News