Tuesday, March 4, 2025

హనుమకొండలో కెటిఆర్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

వరంగల్: హనుమకొండలో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్ పై కేసు నమోదు చేశారు. సిఎం రేవంత్ రెడ్డిపై కెటిఆర్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని హనుమకొండ పిఎస్ లో కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. నిరాధార ఆరోపణలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని, శాంతి భద్రతలకు విఘాతం కలిగేలా కెటిఆర్ వ్యవహరిస్తున్నారని ఫిర్యాదులో కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు. హనుమకొండ పోలీస్ స్టేషన్ లో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఐపిఎస్ సెక్షన్లు 504, 505 కింద కెటిఆర్ పై కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News