Monday, December 23, 2024

ఎంపి ధర్మపురి అర్వింద్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case registered on MP Darmapuri aravind

హైదరాబాద్: నిజామాబాద్ బిజెపి ఎంపి ధర్మపురి అర్వింద్ పై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు.  ముఖ్యమంత్రి కెసిఆర్ ఫోటోలను మార్ఫింగ్ చేసి, అసభ్యకర పోస్ట్ చేసినందుకు ఎంపి అర్వింద్ పై… 504, 505(2), 153ల ఐపిసి, 67 ఐటి యాక్ట్ 2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.  ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు మీద అసభ్యకర పోస్టులు, వీడియోలు పెట్టినందుకు గతేడాది డిసెంబర్ 31న వనస్థలిపురం ఎసిపికి టిఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై. సతీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. ఎంపి అర్వింద్ పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా టిఆర్ఎస్ సోషల్ మీడియా స్టేట్ కన్వీనర్ వై సతీష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తప్పుడు ప్రచారం చేసే వారిని ఇకపై వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. వారి ఆకృత్యాలను, విష ప్రచారాలను చట్టంతోనే బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఇది ఆరంభం మాత్రమే అని అన్నారు. సిఎం కెసిఆర్ ఫోటోను మార్ఫింగ్ చేసి, ఓ వీడియో చేసి సోషల్ మీడియా ప్రచారం చేయడమనేది ఒక ఎంపి చేయాల్సిన పనులేనా? అని ప్రశ్నించారు. పసుపు రైతుల ఇష్యూను డైవర్ట్ చేయడానికి ఇలాంటి చిల్లర పోస్టులు పెడుతుంటాడని మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన బిజెపి నాయకులకు ఒక విషయాన్ని గుర్తు చేశారు.

కేంద్రంలో మీ ప్రభుత్వం ఉన్నంత మాత్రానా బీజేపీ నాయకులు తాము చట్టాలకు, రాజ్యాంగానికీ అతీతులము కామని అనుకుంటున్నారని, చట్టం ముందు అందరు సమానమేనని గుర్తు చేశారు. మీరు ఎంపిలు, ఎమ్మెల్యేలు అయినంత మాత్రానా మీరు అతీతులు ఏం కారని హితవు పలికారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అగ్రనాయకుల తీరు చూస్తుంటే రాష్ట్రంలో ఘర్షణలు సృష్టించేలా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వారిని కట్టడి చెయ్యకపోతే తెలంగాణ శాంతి భద్రతలకే ముప్పు వాటిల్లే ప్రమాదముందని సతీష్ రెడ్డి హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News