- Advertisement -
కరీంనగర్: మాజీ ఐపిఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పై కరీంనగర్ త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీశారంటూ ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ వేశాడు. ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదు చేసి విచారణ చేపట్టాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఐపిసి 144/2021, 153-ఎ, 295-ఎ, 298 ఆర్/డబ్ల్యు, 34 సెక్షన్ల క్రింద కేసు నమోదు చేశారు.
- Advertisement -