Friday, December 27, 2024

మాజీ ఎంఎల్ఎ షకిల్ పై కేసు నమోదు….

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రజాభవన్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం కేసు కీలక మలుపు తిరిగింది. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకిల్ పై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నుంచి తనయుడిని రక్షించేందుకు షకిల్ ప్రయత్నించినట్టుగా గుర్తించి ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. షకిల్ కుమారుడు సోహెల్ దుబాయ్ పారిపోయేందుకు సహకరించిన పదిమందిని పోలీసులు గుర్తించారు. పంజాగుట్ట పోలీసులు ఇప్పటికే సోహెల్ పై లుకౌట్ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. పోలీసులు తన అరెస్టు చేయొద్దంటూ కోర్టును సోహెల్ లాయర్ ఆశ్రయించాడు. సోహెల్ ను దుబాయ్ నుంచి రప్పించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. దుబాయ్ పారిపోయెందుకు సహకరించిన వారిలో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరి కొంతమందికి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News