Sunday, December 22, 2024

సిఎంఆర్‌ఎఫ్ నిధుల గోల్‌మాల్.. 28 ఆసుపత్రులపై కేసులు

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో వెలుగులోకి వచ్చిన ముఖ్యమంత్రి సహాయనిధి (సిఎంఆర్‌ఎఫ్) స్కామ్‌లో కీలక పరిణామం చోటు చేసుకుంది. కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల నిర్వా కం బట్టబయలైంది. రోగులకు చికిత్స అందించ కుండానే నకిలీ బిల్లులతో సిఎంఆర్‌ఎఫ్ నిధులు కొట్టేసి మోసాలకు పాల్పడ్డట్లు తాజాగా సిఐడి గుర్తించింది. ఈ మేరకు ప్రజల సొమ్మును లూ టీ చేసిన ఆసుపత్రులపై కేసులు నమోదు చేసిం ది. హైదరాబాద్, ఖమ్మం, నల్గొండ, కరీం నగర్, వరంగల్, మహబూబాబాద్ జిల్లాల్లోని మొత్తం 28 ప్రైవేటు ఆసుపత్రులపై ఆరు కేసులను సిఐడి బుక్ చేసింది. గతేడాది ఏప్రిల్‌కు ముందు ఆసుపత్రులు ఈ దందాను నిర్వహించినట్లు ఎఫ్‌ఐఆర్‌లో సిఐడి వెల్లడించింది. నకిలీ బిల్లులతో ప్రైవే టు ఆసుపత్రులు ముఖ్యమంత్రి సహాయనిధి డ బ్బులను దుర్వినియోగం చేస్తున్నాయనే ఆరోపణలు తీవ్ర స్థాయిలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఆసుపత్రి సిబ్బంది కలిసి నిధులు దోచేశారని తన ఎఫ్‌ఐఆర్‌లో తెలిపింది. దీనిపై సచివాలయ రెవెన్యూ మంత్రిత్వ శాఖ సెక్షన్ ఆఫీసర్ డిఎస్‌ఎన్ మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇందులో కొందరు రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు ఫిర్యాదులో పొందు పరిచారు. ఈ కుంభకోణంలో కొందరు బడా నాయ కులు సైతం ఉన్నట్లు తేలింది. దీనితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకున్నారు. విచారణను సిఐడికి బదలాయించారు. రంగంలో దిగిన సీఐడీ అధికారులు తమ దర్యాప్తును ఉధృతం చేశారు. పలు ఆసుపత్రులపై ఈ ఎఫ్‌ఐ ఆర్‌లు నమోదవ్వడంతో సిఎం సహాయ నిధి జాబితా నుంచి తొలగించారు. ఇదిలా ఉండగా, ఈ కేసులో గతంలోనే మాజీ మంత్రి, ప్రస్తుత బిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎ హరీశ్ రావు వద్ద ఎంట్రీ ఆపరటర్‌గా పని చేసే వ్యక్తిపై సైతం కేసు నమోదైంది.

28 ఆసుపత్రుల వివరాల్లోకెళితే…
అరుణ శ్రీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ఐఎస్ సదన్ ఎక్స్ రోడ్, శ్రీ కృష్ణ హాస్పిటల్, సైదాబాద్, జనని హాస్పిటల్, సైదాబాద్, హిరణ్యా హాస్పిటల్, మీర్పేట్, డెల్టా హాస్పిటల్, హస్తినాపురం, శ్రీ రక్షా హాస్పిటల్, బిఎన్ రెడ్డి నగర్, ఎంఎంఎస్ హాస్పిటల్, సాగర్ రింగ్ రోడ్, ఎడిఆర్‌ఎం మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, శారదానగర్,ఎంఎంవి ఇందిరా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, కొత్తపేట, శ్రీ సాయి తిరుమల హాస్పిటల్, బైరామల్ గూడ. ఖమ్మంలో : శ్రీ శ్రీకర మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, గ్లోబల్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్, డా. జె.ఆర్.ప్రసాద్ హాస్పిటల్, శ్రీ వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, శ్రీ సాయి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, వైష్ణవి హాస్పిటల్, సుజాత హాస్పిటల్, న్యూ అమృత హాస్పిటల్, ఆరెంజ్ హాస్పిటల్, మెగశ్రీ హాస్పిటల్, బోనకల్. నల్గొండలో ః నవీనా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ, మహేష్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, మిర్యాలగూడ, అమ్మ హాస్పిటల్, రైల్వే స్టేషన్ రోడ్. కరీంనగర్‌లో : సప్తగిరి ఆసుపత్రి, జమ్మికుంట, శ్రీ సాయి ఆసుపత్రి, పెద్దపల్లి. వరంగల్ లో :
రోహిణి మెడికేర్ ప్రైవేట్ లిమిటెడ్., హనుమకొండ. మహబూబాబాద్‌లో: శ్రీ సంజీవిని హాస్పిటల్, సిద్ధార్థ హాస్పిటల్.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News