Monday, December 23, 2024

నటుడు నరేష్ మాజీ భార్యపై కేసులు నమోదు

- Advertisement -
- Advertisement -

Cases registered against actor Naresh's ex-wife

 

హైదరాబాద్ : తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం చేసిందని సినీనటుడు నరేష్ మాజీ భార్యపై పలువురు బాధితులు గచ్చిబౌలి పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….మాజీ మంత్రి రఘువీరారెడ్డి తమ్ముడి కుమార్తె రమ్యరఘును సినీనటుడు, ‘మా’ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు వి.కె నరేష్ ఎనిమిదేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో ఇద్దరు కొన్నేళ్ల క్రితం ఇద్దరు విడిపోయారు. అప్పటి నుంచి ఆమెకు ఖర్చుల కోసం నరేష్ ప్రతి నెలా డబ్బులు పంపిస్తున్నాడు. ఈ క్రమంలోనే రమ్య, నరేష్ పేరు చెప్పి అధిక వడ్డీ ఇస్తానని పలువురి వద్ద చాలామంది వద్ద లక్షలాది రూపాయలు డబ్బులు తీసుకుంది. ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి వద్ద రూ.45లక్షలు తీసుకున్నట్లు తెలిసింది.

డబ్బులు ఇచ్చిన వారు తిరిగి ఇవ్వాల్సిందిగా నిలదీసినా సమాధానం చెప్పడంలేదని ఆరోపించారు. కొందరికి డబ్బులు ఇచ్చేందుకు చెక్కులు ఇచ్చింది, దీంతో వారు రమ్య చుట్టూ తిరుగుతున్నారు. రమ్య దాదాపుగా రూ.7 నుంచి 8 కోట్లు వసూలు చేసినట్లు తెలిసింది. రమ్య ఎంతలా తిరిగినా స్పందించకపోవడంతో బాధితులు సూపర్‌స్టార్ కృష్ణ ఇంటి చుట్టూ వారం రోజుల నుంచి తిరుగుతున్నట్లు తెలిసింది. దీనిపై కృష్ణ వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది, రమ్య విషయంలో తనకు ఏ సంబంధం లేదని నరేష్ స్పష్టం చేశారు. చాలామంది బాధితులకు నరేష్ ఆస్తిని చూపించి అది తనకే చెందుతుందని చెప్పి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. పలువురు బాధితులు ఫిర్యాదు చేయడంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గచ్చిబౌలి పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News