Sunday, January 19, 2025

కేసులను పారదర్శకంగా చేపట్టాలి

- Advertisement -
- Advertisement -

ఆత్మకూర్ : నమోదు అయ్యే ప్రతి కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టి పకబ్బందీగా ఇంటరాగేషన్ రిపోర్ట్ తయారు చేసి కోర్టులో చార్జీ వేయడం ద్వారా నిందితులకు పడే శిక్షల శాతం మరింత పెంచేందుకు పోలీస్ అధికారులు కృషి చేయాలనీ డిఎస్‌పి ఆనంద రెడ్డి తెలిపారు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీ భాగంగా పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పోలీస్‌స్టేషన్‌లో పెం డింగ్‌లో ఉన్న కేసులను వివరాలను ఎస్సైని అడిగి తెలుసుకుని పెండింగ్‌లో ఉన్న కేసులను సత్వరమే పరిష్కారానికి తగు చర్యలు చేపట్టాలని ఎస్సైని ఆదేశించారు.

అనంతరం డీఎస్పీ మాట్లాడుతూ సమగ్ర విచారణ ద్వారా నిందితులకు శిక్షపడే విధంగా చేసి బాధితులకు న్యాయం చేకూరేలా అధికారులు అందరూ బాధ్యతగా వ్యవహరించలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసుల సత్వర పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ త్వరితగతిన న్యాయస్థానం ద్వారా తీర్పు వెలువడేలా చేసి శిక్షల రేటును పెంచాలని కోరా రు. మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, అందుకు దర్పన్ యాప్‌ను వినియోగించుకోవాలని అలాగే ఇతర జిల్లాలో గుర్తించని డెడ్ బాడీ కేసుల వివరా లు సమీక్షించుకోవాలని అన్నారు.

పోలీస్ట్ స్టేషన వర్టికల్ పనితీరును పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో నిత్యం డ్రంక్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించి, మ ద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై మరియు ఓపెన్ ఏరియాలో మద్యం సేవించే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే న్యూ సెన్స్ చేసే వారిపై కేసులు నమోదు చేయాలని, రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని స్టాపర్స్ ఏర్పాటుతో పాటు తప్పని సరిగా సిసి కెమరాలను ఏర్పాటు చేయించాలని ఎస్‌ఐని ఆదేశించారు. నేరాలు జరిగే ప్రదేశాలు, శాంతి భద్రతలకు విఘాతం కలిగించే ప్రదేశాలు హాట్ స్పాట్‌గా గుర్తిం చి పాయింట్ బుక్స్ ను తనిఖి చేసేటట్లు చూసుకోవాలని సూచించారు.

కమ్యూనిటీ పోలిసింగ్‌లో భాగంగా గ్రామాలలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో పని చేయని వాటిని గుర్తించి అందు బాటులో తీసుకురావాలని సూచించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో సిసి కెమెరాలను మరింత పెంచేందుకు వాటి పై ప్రజలకు అవగాహన కల్పించి సిసి కెమెరాలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకునేల చూడాలని తెలిపారు. ప్రతి కేసులో నిందితులకు సంబంధించి పాపిలాన్ డివైస్‌ను ఉపయోగించి ఫ్రింగర్ ప్రింట్ తీసుకోవాలని తద్వారా భవిష్యత్‌లో వారు ఏ నేరంలో పాల్గొన్న గుర్తించేందుకు సులభతరం అవుతుందని పేర్కొన్నారు.

సైబర్ నేరాలకు సంబంధించి అమౌంట్ బ్లాక్ ఆయన ఫిర్యాదులను తప్పనిసరిగా సైబర్ క్రైమ్ కెసు నమోదు చేయాలన్నారు. గ్రామాలు,పాఠశాలలు, కళాశాలలో సైబర్, కమ్యూనిటీ పోలీస్ అవేర్నెస్ ప్రోగ్రాంలు నిర్వహించాలని, సిఇఐఆర్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్స్‌ను గుర్తించి త్వరగా రికవరీ చేసి బాధితులకు అందించేందుకు కృషి చేయాలన్నారు.

ప్రతి శనివారం కోర్డు డ్యూటీ అధికారులతో మీటింగ్ నిర్వహించి కోర్ట్ కేసులను సమీక్షించుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరు క్రమశిక్షణను కలిగి ఉండాలని, బాధ్యతతో విధులు నిర్వర్తించి ప్రజల మన్ననలు పొందాలని సూచించారు. ఈ తనిఖీలో సిఐ రత్నం, ఆత్మకూరు ఎస్సై నరేందర్, సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News