Wednesday, January 22, 2025

జాతీయ లోక్ ఆదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలి

- Advertisement -
- Advertisement -
  • జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని

మెదక్ ప్రతినిధి: జాతీయ లోక్ ఆదాలత్‌లో కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నెల నేటి నుంచి 9వ తేదీ వరకు జిల్లా కోర్టులో జాతీయ లోక్ ఆదాలత్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు.

జాతీయ లోక్ ఆదాలత్‌లో సామరస్య ధోరణితో రాజీ పడదగిన వివిధ కేసులపై న్యాయస్థానాల చుట్టూ తిరగకుండా కేసుల పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అలాగే జాతీయ లోక్ ఆదాలత్‌లో రాజీపడే అవకాశం ఉన్న కేసులను లిస్టు అవుట్ చేసుకోవాలని, రాజీ పడదగిన కేసుల్లో ఇరువర్గాల వారిని పిలిపించి చిన్నచిన్న కేసులతో జీవితాలు నాశనం చేసుకోవద్దని ఒకే గ్రామంలో ఉండే వారు ఎప్పుడు కలిసిమెలసి ఉంటారు. కాబట్టి రాజీమార్గం రాజమార్గమని సూచించారు. న్యాయశాఖ అధికారులతో సమన్వయం ఏర్పరచుకొని విధులు నిర్వహించాలని సూచించారు. జాతీయ లోక్ ఆదాలత్‌లో సాధ్యమైనంతవరకు ఎక్కువ మొత్తంలో కేసులు రాజీ కుదిరేలా చూడాలన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News