Monday, December 23, 2024

కేసులను సత్వరమే పరిష్కరించాలి

- Advertisement -
- Advertisement -

మాగనూర్: పోలీస్ స్టేషన్‌కు వచ్చే కేసులను సత్వరమే పరిష్కరించాలని నారాయణపేట డీఎస్పీ సత్య నారయణ అన్నారు. శుక్రవారం వార్షిక తనిఖీలో భాగంగా ఆయన మండల కేంద్రంలోని పోలీస్‌స్టేషన్ సందర్శించి పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రికార్డులను తనిఖీ చేసి కేసుల పురోగతిని తెలుసుకుంటామన్నారు.

పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని సిబ్బందికి సూచించారు. ప్రజలతో స్నేహపూర్వకంగా ఉండాలని స్టేషన్‌కు వచ్చిన వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. అంతకు ముందు పోలీసులచే గౌరవవందనం స్వీకరించి పోలీస్‌స్టేషన్‌లో మొక్కలు నాటారు. కార్యక్రమంలో సిఐ రామ్‌లాల్, ఎస్‌ఐ మల్లేష్, పోలీస్‌సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News