Thursday, January 23, 2025

అటవీ భూమిని అక్రమిస్తే కేసులు నమోదు చేస్తాం

- Advertisement -
- Advertisement -

వరంగల్ : అటవీ భూమిని అక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని వరంగల్ సిసిఎఫ్ వినోద్ కుమార్ హెచ్చరించారు. గత కొన్ని రో జులుగా మహాదేవపూర్ మండలంలోని సూరారం గ్రామంలో దళితులకు, ఫారెస్ట్ అధికారుల మధ్య వివాదంలో ఉన్న కుమ్మరి కుంట భూమిని పోలీసు బలగాలతో కలిసి బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన దళితుల తో మాట్లాడుతూ అటవీశాఖ భూమిని ఆక్రమిస్తే కేసులు నమోదు చేసి కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

గత కొద్ది సంవత్సరాలుగా మేము కాస్తులో ఉన్నాము అని మాకు మహాదేవపూర్ తహసీల్దారు ఆఫీ సు నుండి పొజిషన్ సర్టిఫికెట్లు ఒక్కొక్క కుటుంబ నికి 18 గుంటల చొప్పున 120 మందికి ఇ చ్చారు అని దళితులు తెలిపారు. పేద ప్రజల కడుపు మీద కొట్ట వద్దు అని కోరారు. అదేవిధం గా దళితులు వెనుతిరిగి భూపాలపల్లి కి వెళ్ళి జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రాకు కలిసి దరఖాస్తు ఇ చ్చి వారి గోడు విన్న వివరించారు.

కావున తెలంగాణ ప్రభుత్వం స్పందించి దళిత కుటుంబాలకు పట్టాలిచ్చి ఆదుకోవాలని కోరారు. ఆయన వెంట జయశంకర్ జిల్లా ఫారెస్ట్ అధికారి లావణ్య, సబ్ డివిజన్ అధికారి వజ్ర రెడ్డి, మహాదేవపూర్ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ కమల సిఐ కిరణ్ కుమార్, మహాదేవపూర్ ఎస్సై ఎన్ రాజు కుమార్ తదితరులున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News