Wednesday, January 22, 2025

పట్టుబడిన రూ.351 కోట్లు నావి కాదు.. ఎంపి ధీరజ్ సాహు వెల్లడి

- Advertisement -
- Advertisement -

భువనేశ్వర్ : కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ధీరజ్ ప్రసాద్‌౯సాహు౦ మద్యం డిస్టిలరీ, దాని అనుబంధ సంస్థలపై కొనసాగిన తనిఖీల్లో లెక్కలు చూపని రూ.351 కోట్ల నగదును ఆదాయం పన్ను అధికారులు కనుగొన్న సంగతి తెలిసిందే. పట్టుబడిన ఈ సొమ్ము తనది కాదని, వందేళ్లకు పైగా తమ కుటుంబ సభ్యులు వ్యాపారంలోనే ఉన్నారని, అదంతా మద్యం అమ్మకాల ద్వారానే వచ్చిందని ధీరజ్ సాహు వెల్లడించారు. ఈ డబ్బుతో కాంగ్రెస్ పార్టీకి కానీ, మరే పార్టీకి కానీ సంబంధం లేదని స్పష్టం చేశారు.

తన కుటుంబం వందేళ్లకు పైగా మద్యం వ్యాపారంలో ఉంటూ అనేక వ్యాపారాలను విస్తరించిందని, పాఠశాలలు, కాలేజీలు వంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిందని ధీరజ్‌సాహు పేర్కొన్నారు. లిక్కర్ వ్యాపారం అంతా నగదులోనే జరుగుతుందనే విషయం అందరికీ తెలిసిందేనని చెప్పారు. ఆ డబ్బంతా తనది కాదని, తన కుటుంబ సభ్యులదని, , ఇతర కంపెనీలకు చెందినదని వివరించారు.

పట్టుబడిన సొమ్ము నల్లధనమా, చట్టబద్ధమైన ధనమా అనేది ఐటీ చెబుతుందన్నారు. ఈ వ్యాపారంలో తనకు ప్రత్యక్ష ప్రమేయం ఏదీ లేదని, దీనికి సంబంధించి ఏ ప్రశ్నలకైనా తన కుటుంబ సభ్యులు సమాధానం చెబుతారని అన్నారు. సాహూకు చెందిన బౌద్ధ్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్, దాని అనుబంధ సంస్థల్లో ఈనెల 6న ప్రారంభమైన ఐటీ దాడులు శనివారంతో ముగిశాయి. ఒడిశా, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్ లోని పలు ప్రాంతాల్లో జరిపిన దాడుల్లో రూ.351 కోట్ల నగదు, మూడు కిలోల బంగారం పట్టుబడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News