Sunday, November 17, 2024

ఎన్నికల్లో రూ.12,62,41,220 నగదు సీజ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: పార్లమెంటరీ ఎన్నికల తనిఖీల్లో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా చేపట్టిన వాహనాల తనిఖీల్లో రూ.12,62,41,220 నగదు పట్టుకున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషన్ రోనాల్ రోస్ తెలిపారు. వాటితోపాటు కోటి 73 లక్షల 60 వేల 502 రూపాయల విలువ గల ఇతర వస్తువులు, 19,380.87 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన 141 మందిపై కేసులు నమోదు చేసి 136 మందిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

ఎన్నికలకు సంబంధించిన నగదు, ఇతర వస్తువులపై 280 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామనిని, 185 మంది పై ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేశామని, లైసెన్సు గల 2,409 ఆయుధాలను డిపాజిట్ చేసినట్టు రోనాల్ రోస్ తెలిపారు. గడిచిన 24 గంటల వ్యవధిలో రూ. 13,13,950 నగదు, 34,159 రూపాయలు విలువైన వస్తువులను పట్టుకుని సీజ్ చేసినట్లు తెలిపారు.

ఎక్స్ సైజ్ శాఖ ద్వారా 22.44 లీటర్ల అక్రమ మద్యాన్ని పట్టుకుని,ఇద్దరిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. నగదు ఇతర వస్తువులపై 11 ఫిర్యాదులు రాగా వాటిని పరిష్కరించామని, నలుగురిపై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేసినట్లు తెలిపారు. 38 లైసెనస్డ్ ఆయుధాలను డిపాజిట్ చేసినట్లు ఆయన తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నాటి నుండి ఇప్పటివరకు ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాల ద్వారా రూ. 2,76,58,400/-, పోలీస్ శాఖ ద్వారా రూ.9,70,03,130, ఎస్‌ఎస్‌టి బృందాల ద్వారా రూ.15,79,690 నగదు సీజ్ చేశామని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News